అల్లరి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు నరేష్ ఈ సినిమాతో అల్లరి నరేష్ గా మారిపోయారు.ఇలా ఎంతో వైవిద్య భరితమైన కామెడీ చిత్రాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నరేష్ గత కొన్ని రోజులుగా సరైన హిట్ సినిమాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
అయితే తాజాగా ఈయన నటించిన నాంది సినిమా ద్వారా తానేంటో మరోసారి రుజువు చేసుకొని వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇందులో అల్లరి నరేష్ ఎన్నికల విధులు నిర్వర్తించే ఓ అధికారి పాత్రలో నటించారు.
ఇక ఈ సినిమా నవంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ జీ 5 భారీ ధరలకు కైవసం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా వచ్చే ఏడాది ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వచ్చాయి.అయితే వచ్చే ఏడాది కంటే ముందుగానే ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయాలని భావించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే డిసెంబర్ 23వ తేదీ నుంచి ఈ సినిమా జీ 5 లో ప్రసారం కానున్నట్టు సమాచారం థియేటర్లో మంచి టాప్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.