పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు మళ్లీ నిలిచి పోయాయి.ఆ మధ్య రామోజీ ఫిలిం సిటీ లో దాదాపు రెండు వారాల పాటు ఏక ధాటిగా షూటింగ్ జరిగింది.
మళ్లీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడం తో హరిహర వీరమల్లు సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరగక పోవడం తో సినిమా విడుదల విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా కచ్చితంగా వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడట.అందుకు పవన్ కళ్యాణ్ సహకరించడం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒక వైపు హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి కాకుండానే మరో వైపు హరిష్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు.ఈ సినిమా షూట్ పూర్తి కాకుండానే కొత్తది మొదలు పెట్టడం ఎంత వరకు కరెక్ట్…

ఇదెక్కడి విడూరం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు క్రిష్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఒక సినిమా పూర్తి అయిన తర్వాత మరో సినిమా ను మొదలు పెడితే బాగుండేది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ మళ్లీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడా అంటూ ఎదురు చూస్తున్నాం అంటున్నారు.పవన్ హరీష్ శంకర్ మూవీ నే కాకుండా సుజీత్ దర్శకత్వం లో ఒక సినిమా ను కమిట్ అయ్యాడు.
అంతే కాకుండా వినోదయ్య సిత్తం సినిమా రీమేక్ పనులు కూడా జరుగుతున్నాయట.







