'RAPO20'లో బాలీవుడ్ స్టార్.. బోయపాటి నెక్స్ట్ లెవల్ ప్లాన్స్!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ‘RAPO20’.ఇటీవలే బోయపాటి బాలయ్యతో అఖండ సినిమా తీసి ఘన విజయం అందుకుని తన నెక్స్ట్ సినిమా కోసం మరింత జోష్ గా సిద్ధం అవుతున్నాడు.

 Sunil Shetty In Ram Pothineni And Boyapati Rapo20 2-TeluguStop.com

రామ్ పోతినేని ఎనర్జీ బోయపాటి యాక్షన్ తో మిక్స్ అయితే ఇక అదిరిపోయే మాస్ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది.

అందుకే ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి.

ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో ఫుల్ ఫోకస్ పెట్టి తెరకెక్కించ బోతున్నారు.ఇటీవలే దసరా కానుకగా ఈ సినిమా నుండి హీరోయిన్ ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటించ బోతుంది అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి శరవేగంగా షూట్ జరుపు తున్నారు.

ఇది పక్కన పెడితే తాజాగా ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.ఈ సినిమాలో బాలీవుడ్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నాడట.

ఆయన మరెవరో కాదు.సీనియర్ హీరో సునీల్ శెట్టి.

ఈయన ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమాకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ అయ్యే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా అదిరిపోయే ఐటెం సాంగ్ చేయబోతోందని కూడా టాక్.ఇక ఈయన బాడీ లాంగ్వేజ్ కూడా సరిపడే కథను యాక్షన్ ఎంటర్టైనర్ గా మలిచ బోతున్నాడు అని తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో.

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నాడు.మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube