జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మాజీమంత్రి వెల్లంపల్లి సెటైర్లు విసిరారు.పవన్ కల్యాణ్ వారాలబ్బాయని చెప్పారు.
పవన్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని తెలిపారు.రాజకీయాల్లో పవర్ లేని స్టార్ పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు.
కానీ పవన్ ను కాపులు కూడా నమ్మే స్థితిలో లేరని వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసే పవన్ కు ఉందా అని ప్రశ్నించారు.
అంతేకాకుండా ఆయన రద్దైన నోట్లతో సమానమంటూ విమర్శలు గుప్పించారు.







