మ్యాజిక్ చేస్తూ నయనతారను రప్పించిన సుమ.. మాకు కూడా ఆ టాలెంట్ ఉంటే బాగుండంటూ నెటిజన్స్ ట్రోల్స్?

టాలీవుడ్ లో యాంకర్ సుమ గురించి మాత్రం తెలినోలే లేరని చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాందించుకుంది సుమ.

 Suma Lured Nayanthara By Doing Magic Are Netizens Trolling Saying That It Would-TeluguStop.com

స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ యాంకర్ సుమకు ఉందని చెప్పవచ్చు.ఇక తన చురుకుతనంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ గా ఒక పేరు సంపాదించుకుంది సుమ.

తెలుగు బుల్లితెరపై కొన్నేళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా నిలిచింది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ సుమ కు గట్టిగా కాకుండా యాంకర్ గానే క్రేజ్ వచ్చింది.ఒక ఎంటర్టైన్మెంట్ షో లలోనే కాకుండా వెండితెర కు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ తన హోస్టింగ్ తో బాగా సందడి చేస్తుంది.

బుల్లితెరపై ఏకకాలంలో పలు షో లలో బాగా సందడి చేసేది.

ఇక సుమ మాటలు వింటే మాత్రం ఎవరైనా కరగాల్సిందే.తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.

పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్.

స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన గల గల మాటలతో వారిని కూడా ఫిదా చేస్తుంది.

ఇతర భాషలకు చెందిన సెలబ్రెటీలను కూడా సుమ ఒక రేంజ్ లో ఆట ఆడిస్తుందంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు.

ఇంతవరకు సుమకు ఎటువంటి విమర్శలు కూడా రాలేవు.ఎందుకంటే ఆమె ఉండే విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.ఆమె మాట్లాడే విధానం అందర్నీ ఆకర్షిస్తుంది.అటువంటి సుమకు భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే శక్తి ఉందని సులువుగా చెప్పవచ్చు.

ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా సుమ బాగా యాక్టివ్ గా మారింది.ఇక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకొని అందులో కూడా పలు షోస్ చేస్తుంది.అలా వెండితెరపై సినిమా ఈవెంట్లలో, బుల్లితెరపై షోలతో, సోషల్ మీడియాలలో ఎంటర్టైన్మెంట్ వీడియోలతో బాగా బిజీగా మారింది సుమ.అయితే సుమ బాగా ఆట పట్టిస్తూ ఉంటుంది.సరదా చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా తన ఇన్ స్టా లో ఒక వీడియో షేర్ చేసుకుంది సుమ.అందులో నయనతార కూడా ఉంది.అయితే నయనతార నటించిన కనెక్ట్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రమోషన్స్ భాగంలో నయనతార సుమ ఇంటర్వ్యూ కి వచ్చింది.

మామూలుగా నయనతార ప్రమోషన్స్ లో అంతగా పాల్గొనదు.కానీ ఈసారి ప్రమోషన్స్ లో పాల్గొనడంతో తన అభిమానులల్లో కాస్త ఉత్సాహం కనిపించింది.

అయితే దానికి సంబంధించిన వీడియో సుమ షేర్ చేసుకుంది.అయితే సుమ సరదాగా ఓం భూమ్ అంటూ మ్యాజిక్ చేస్తూ నయనతార ని రప్పించింది.అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్.మాలో కూడా ఈ టాలెంట్ ఉంటే బాగుండేది కదా.మేము కూడా అందర్నీ మ్యాజిక్ చేస్తూ రప్పించే వాళ్ళం అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.ఇక ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube