తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫుల్ గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే.మొదట హోస్ట్ నాగార్జున గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు.
అనంతరం ఒక్కొక్క సెలబ్రిటీలను హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించాడు నాగార్జున.హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా రేవంత్, రోహిత్, కీర్తి,ఆదిరెడ్డి శ్రీహాన్ లు మిగిలిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత నాగార్జున ఒక్కొక్క సెలబ్రిటీలను ఎంట్రీ ఇప్పించే క్రమంలో మొదట నిఖిల్ ని ఎంట్రీ ఇప్పించి టాప్ ఫైవ్ లో ఉన్న ఎలిమినేట్ చేశాడు.ఆ తర్వాత ధమాకా సినిమా హీరో హీరోయిన్ రవితేజ శ్రీలీల ను బిగ్ బాస్ వేదిక పైకి ఆహ్వానించాడు నాగర్జున.
ఇక నాగార్జున శ్రీ లీలా కలిసి ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేశారు.అయితే ఎంట్రీ ఇవ్వడంతోనే శ్రీ లీల రవితేజ ఇద్దరు కలిసి ధమాకా మూవీలోని సాంగ్ కి స్టెప్పులను ఇరగదీస్తూ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత శ్రీ లీల, రవితేజ కలసి నాగార్జునతో ముచ్చటించారు.ఈ క్రమంలోని రవితేజ హిట్ ఫ్లాప్స్ గురించి మాట్లాడుతూ సెటైర్స్ వేశారు.అనంతరం శ్రీ లీల అందం గురించి నాగార్జున మాట్లాడుతూ ఒక రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించాడు.ధమాకా సినిమా జింతాక సాంగ్ ని తాను శ్రీ లీల కోసమే ఎన్నోసార్లు చూశానని తెలిపారు.
ఇక రవితేజ తన లైఫ్ గురించి బిగ్ బాస్ వేదికపై అతిపెద్ద సీక్రెట్ ని రివిల్ చేశారు.

తమ పరిశ్రమ గురించి నాగార్జున, రవితేజ ఇద్దరూ షాపింగ్ విషయం చెప్పడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.తన సినీ పరిశ్రమ ప్రయాణం మొదలుపెట్టింది నాగార్జున గారి చిత్రంతోనే అని రవితేజ తెలిపాడు.మొదట నాగార్జున సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరియర్ ను ప్రారంభించాను.
ఫస్ట్ రెమ్యూనరేషన్ కూడా నాగార్జున గారు చెక్కు రూపంలో ఇచ్చాడు అని తెలిపాడు రవితేజ.ఆ చెక్ ని అలాగే దాచుకుందాం అనుకున్నాను కానీ ఎక్కడో పోయింది.
నన్ను నాగార్జున గారు ఎంతగానో ప్రోత్సహించారు.ఆయన నాకు ఆదర్శం అంటూ రవితేజ తన అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం శ్రీ లీల కన్నడలో మాట్లాడుతూ ఉండడంతో నాగార్జున రవితేజ ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ తలలు బాదుకున్నారు.దాంతో అక్కడున్న వారందరూ ఫన్నీగా నవ్వుకున్నారు.







