పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.ఈ క్రమంలోనే రాయికర్రవలస గ్రామంలో పశువులపై గజరాజుల గుంపు దాడికి పాల్పడిందని సమాచారం.
దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఏనుగుల గుంపు సంచారంపై అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం అందించిన పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను ఓ ఇంట్లో బంధించారని తెలుస్తోంది.