అన్‌స్టాపబుల్ : ప్రభాస్‌ కంటే ముందు వారు రాబోతున్నారా?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో ప్రభాస్ మరియు గోపీచంద్ కలిసి రాబోతున్న విషయం తెలిసిందే.వారిద్దరి ఎపిసోడ్‌ కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి.

 Jayasudha And Jayapradha In Balakrishna Unstoppable Talk Show ,rashi Khanna, Jay-TeluguStop.com

ఈ వారం కాకుండా వచ్చే వారం లో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది.అయితే ఈ వారం ఎపిసోడ్ కూడా ఉండదా అంటూ నందమూరి బాలకృష్ణ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వారి కోసం అన్నట్లుగా ఆహా టీం ఒక ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది.ప్రభాస్ ఎపిసోడ్‌ కంటే ముందే ఆ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ ఎపిసోడ్ లో జయసుధ మరియు జయప్రద కలిసి సందడి చేయబోతున్నారు.వీరిద్దరితో పాటు ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు మరియు తమిళం లో వరుసగా సినిమా ల్లో నటిస్తున్న ముద్దు గుమ్మ రాశి ఖన్నా ను కూడా ఈ కార్యక్రమానికి తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని.ఒకటి రెండు రోజుల్లోనే ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో ని విడుదల చేస్తారని.ఈ వారం లో కచ్చితం గా ఎపిసోడ్ ఉంటుందని అంతా భావిస్తున్నారు.గతం లోనే ఈ వార్తలు వచ్చాయి.కానీ ప్రభాస్ కి సంబంధించిన ఎపిసోడ్ కారణం గా వార్తలు పెద్ద గా సందడి చేయలేదు.పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నాడు అనే ప్రకటన అధికారికం గా వచ్చింది.

కనుక కచ్చితం గా రాబోయే ఎపిసోడ్స్ ఒక అద్భుతం ఉన్నట్లుగా ఉంటాయని బాలకృష్ణ అభిమానులు ధీమా తో ఉన్నారు.ప్రస్తుతం ఆహా ఓటీటీ వారు ఇప్పటి వరకు స్ట్రీమింగ్ చేసిన ఎపిసోడ్స్ కి సంబంధించిన విజువల్స్ ని మళ్లీ మళ్లీ వేస్తున్నారు.

తప్పితే కొత్త ఎపిసోడ్స్ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.అతి త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube