ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి లేఖ రాశారు.ఇవాళ విచారణకు హాజరుకాలేనని పేర్కొన్నారు.
విచారణకు హాజరయ్యేందుకు మరో వారం రోజుల పాటు గడువు కావాలని లేఖలో కోరారు.ఈనెల 25 వరకు సమయం కావాలన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విన్నపాన్ని ఈడీ అధికారులు పరిశీలించనున్నారు.
కాగా రోహిత్ రెడ్డి ప్రగతిభవన్ లో ఉన్నారు.ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ తో ఆయన చర్చిస్తున్నారని సమాచారం.







