ప్రమాదం ఎప్పుడు ఎక్కడినుండి పొంచి ఉంటుందో చెప్పలేము.మన జాగ్రత్తలో మనం ఉన్నప్పటికీ పెద్దలు చెప్పినట్టు, జరగాల్సి వున్నపుడు అలాంటివి జరగక మానవు అని అనిపించక మానదు… మీరు ఈ కథను విన్నాక.
అవును, అక్కడ పాఠశాలలో క్రీడా పోటీలు చాలా ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి.సరిగ్గా అదే సమయంలో రెప్పపాటులో ఒక జావెలిన్ వచ్చి ఓ బాలుడి గొంతులోకి దూసుకు పోయింది.
దీంతో ఆ బాలుడు కుప్పకూలాడు.ఈ ఘటన ఒడిశాలోని బాలంగీర్ జిల్లాలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
9వ తరగతి చదువుతున్న సదానంద మెహర్ అనే విద్యార్థి అగల్ పూర్ బాలుర పంచాయతీ ఉన్నత పాఠశాల మైదానంలో తన పనిలో తాను ఉన్నాడు.అదే ప్రాంతంలో కొంతమంది విద్యార్థులు జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్నారు.
అందులో ఒక విద్యార్థి జావెలిన్ విసరగా అది సరాసరి సదానంద మెహర్ ఎడమ వైపు నుంచి దూసుకువచ్చింది.దాంతో సదానంద మెడ ఎడమ వైపు నుంచి గడ్డం భాగంలో బలంగా గుచ్చుకుని, కుడి వైపు నుంచి బటయకు వచ్చేసింది.
దీంతో ఆ బాలుడిని వెంటనే బాలంగిర్ లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

వెంటనే అక్కడి వైద్యులు అప్రమత్తమై ఆ బాలుడి మెడ నుంచి జావెలిన్ ను సురక్షితంగా బయటకు తీశారు.ప్రస్తుతం మెహర్ ఆసుపత్రిలోకి ICUలో చికిత్స పొందుతున్నాడు.అదృష్టవశాత్తూ ఆ బాలుడికి ఏ ప్రమాదమూ లేదని బలంగీర్ కలెక్టర్ చంచల్ రాణా చెప్పారు.
అయితే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా అందరికీ పొక్కడంతో పాఠశాలలో చోటుచేసుకున్న ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు.ఆ విద్యార్థికి అన్ని రకాల వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు CMO ట్వీట్ చేసింది.







