మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది.జవహర్ నగర్ కు చెందిన ఇందు స్కూల్ నుంచి అదృశ్యమై తరువాతి రోజు దమ్మాయిగూడ చెరువులో శవంగా లభ్యమైన సంగతి తెలిసిందే.
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.బాలిక మృతికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడేమనేనని వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడించారు.
అనంతరం శాంపిల్స్ ను గాంధీ ఫోరెన్సిక్ కు పంపారు.ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ టీం ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బాలిక ఇందు అదృశ్యం తరువాత మరుసటి రోజు నీటిలో పడినట్లు రిపోర్టులో ఉందని సమాచారం.మరోవైపు కేసులో ఇప్పటికే గంజాయి బ్యాచ్ లను పోలీసులు ప్రశ్నించారు.
ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రుల ఫోన్లను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.







