టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు.ఏపీలో ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదని చెప్పారు.ఎన్నికల హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారని తెలిపారు.అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావించి జగన్ ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు.ప్రభుత్వ విద్య, వైద్యాన్ని కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దిన ఘనత జగన్ దేనని పేర్కొన్నారు.
సీఎం జగన్, చంద్రబాబుకు చాలా తేడా ఉందన్నారు.అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారని ఆరోపించారు.







