బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈరోజు నుంచి ఈ సినిమాలోని చివరి సాంగ్ షూట్ జరుగుతోంది.
ఈ సాంగ్ మాస్ సాంగ్ అని సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఈ సాంగ్ ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య ఈ సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రల్లో నటిస్తుండటం గమనార్హం.
తాజాగా ఈ సినిమా నుంచి డైలాగ్ లీకైంది.
ఈ లీకైన డైలాగ్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండటంతో పాటు ఈ మూవీ రేంజ్ మరింత పెరిగే విధంగా ఉంది.“పులివెందుల అయినా పులిచర్ల అయినా పులిబిడ్డ ఈ వీరసింహారెడ్డి.ఈ వీరసింహారెడ్డి ప్రజల ముందు ఉంటే సింహం ముందు ఉన్నట్టే.
ఆ సింహాన్ని ఎదురించి వెళ్లే దమ్ము ఉంటే నువ్వు నన్ను దాటి ప్రజల వద్దకు వెళ్లరా” అనే డైలాగ్ లీక్ కాగా ఈ డైలాగ్ బాలయ్య అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
బాలయ్య నోటి నుండి మాస్ డైలాగ్స్ వింటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.బాలయ్య, శృతి కాంబినేషన్ లో తాజాగా సుగుణ సుందరి సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ లోని బాలయ్య డ్యాన్స్ స్టెప్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.62 సంవత్సరాల వయస్సులో బాలయ్య ఈ స్థాయిలో డ్యాన్స్ చేయడం చూసి షాకవుతున్నామని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య కెరీర్ లో 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన తొలి సినిమా వీరసింహారెడ్డి కాగా 100 కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.ఈ మధ్య కాలంలో బాలయ్య ఏది పట్టుకున్నా బంగారమే అవుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.







