తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతల అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి.రెండు వర్గాలుగా వీడిన కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారని చెప్పొచ్చు.
ఇప్పటికే సీనియర్ నేతలంతా పీసీసీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బలహీనపరిచే కుట్ర జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే అనిల్ అన్నారు.కాంగ్రెస్ ముసుగు వీరులు ఇప్పుడు బయటకు వచ్చారన్నారు.12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినప్పుడు సేవ్ కాంగ్రెస్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.అదేవిధంగా ఉత్తమ్ పై సునీల్ కనుగోలు పోస్ట్ పెట్టినట్లు ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారు.సీనియర్లు పార్టీ కోసం పని చేస్తే మునుగోడులో కాంగ్రెస్ గెలిచేదని చెప్పారు.
సీనియర్ల లోపాయికారి ఒప్పందం బీజేపీతోనా, టీఆర్ఎస్ తోనా అని ప్రశ్నించారు.పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అనిల్ ఆరోపించారు.







