ఈ రోజుల్లో చాలామంది వైఫై రూటర్స్ వాడటం చాలా కామన్ అయిపోయింది.అయితే ఒక్కసారి ఈ వైఫై రూటర్స్‌లో తలెత్తే సమస్యలు చాలా చిరాకు పుట్టిస్తుంటాయి.
ఈ సమస్యలు ఒక్కోసారి రూటర్ హ్యాకింగ్‌కి గురి కావడం వల్ల కూడా రావచ్చు.హ్యాకింగ్‌కి గురైనప్పుడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి.
వాటి ద్వారా మీ వైఫై హ్యాక్ అయినట్లు నిర్ధారించవచ్చు.మరి ఆ లక్షణాలు ఏంటో చూసేద్దామా.
•
నెట్‌వర్క్ స్ట్రెంత్:
ఏ కారణం లేకుండా వైఫై నెట్‌వర్క్ స్ట్రెంత్ దానంతటదే ఎక్కువగా వీకై పోతుంటే.మీ వైఫై హ్యాక్‌కి గురై ఉండే అవకాశం ఉంది.
దీనికి పరిష్కారంగా మీరు వైఫైని రీసెట్ చేసి.కొత్తగా ఒక స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి.
•
సిగ్నల్‌లో మార్పులు:
వైఫై సిగ్నల్ అనేది కంటిన్యూగా ఒకసారి ఎక్కువగా, మరోసారి చాలా తక్కువగా వస్తుంటే, మీ వైఫై హ్యాక్ అయ్యిందని అర్థం చేసుకోవచ్చు.సాధారణంగా సిగ్నల్ హెచ్చుతగ్గులు ఉండటం కామన్.
కానీ అది నిరంతరం జరుగుతూ ఉంటే WiFi పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం మంచిది.

•
వైఫై సిగ్నల్ డెడ్:
మీ వైఫై సిగ్నల్ పూర్తిగా డెడ్ అవుతే కూడా జాగ్రత్త పడాలి.వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి.అప్పటికీ ఆ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మీ వైఫై పవర్‌ను ఆఫ్ చేయాలి.
ఆపై దాన్ని రీసెట్ చేసి పాస్‌వర్డ్‌ను చేంజ్ చేయాలి.
*
వైఫై పవర్ ఆఫ్:
మీ వైఫై దానంతట అదే పవర్ ఆఫ్ అవుతూ ఉంటే కూడా వైఫై హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.ఈ తరహా ప్రాబ్లం సాల్వ్ చేసుకునేందుకు కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి.








