ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు ఇస్తూ భోజనం కానిచ్చేస్తున్నారు.ఈ క్రమంలో స్విగ్గీ తన వార్షిక నివేదికలో ఎన్నో కీలక విషయాలను వెల్లడించింది.స్విగ్గీ విడుదల చేసిన డేటా ప్రకారం, బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ దీపావళి పార్టీ కోసం రూ.75,378 విలువైన ఆర్డర్ ఇచ్చాడు.ఆ తర్వాత పూణేలో ఓ వ్యక్తి తన ఒక్కడికికే ఏకంగా రూ.71,229ల విలువైన బర్గర్‌లు, ఫ్రైలను ఆర్డర్ చేశాడు.అతడికి స్విగ్గీ ఓ బిరుదు కూడా ఇచ్చింది.అత్యంత ఆకలితో ఉన్న కస్టమర్ అని పేరు పెట్టింది.ఇదే కోవలో బెంగళూరుకు చెందిన ఒకరు కేవలం ఒక వారంలో 118 గౌర్మెట్ మీల్స్‌ను ఆర్డర్ చేశారు.విభిన్న ఎంపికలతో పాటు, తగ్గింపులు మరియు ఉచిత డెలివరీ పథకాలు కూడా ఆన్‌లైన్ ఆర్డరింగ్‌ను తక్కువ ధరలకు వస్తుండడంతో అంతా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లకు అలవాటు పడుతున్నారు.
ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారు స్విగ్గీలో రెస్టారెంట్లు అందించే ప్రయోజనాలను ఉపయోగించడం ద్వారా గతేడాది రూ.2.48 లక్షలు ఆదా చేశారు.భారతదేశం అంతటా ఈ తగ్గింపులు వినియోగదారులకు రూ.100 కోట్ల పొదుపును అందించాయి.ఎందుకంటే వారు ఇంటి నుండి ప్రపంచ వంటకాలను కూడా ప్రయత్నించారు.
ప్రపంచంలో ఫేమస్ వంటకాలుఅయిన ఇటలీకి చెందిన రావియోలీ పాస్తా, కొరియాకు చెందిన బిబింబాప్ అత్యంత ఇష్టపడే ఎంపికల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.

ఇన్‌స్టామార్ట్ విషయానికొస్తే, బెంగళూరులోని ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో రూ.16.6 లక్షల విలువైన కిరాణా సామాగ్రిని కొనుగోలు చేశాడు.10 నిమిషాలు కంటే తక్కువ సమయంలో అత్యంత వేగంగా డెలివరీ చేసింది.ఆహారాన్ని కేవలం 50 మీటర్ల దూరం నుండి ఆర్డర్ చేసినప్పటికీ, త్వరగా డెలివరీల కోసం ఒత్తిడి డెలివరీ సిబ్బంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది.వినియోగదారులు స్విగ్గీ అందుబాటులోకి రావడంతో, డెలివరీ సిబ్బంది గత ఏడాది ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై మరియు కొచ్చిలలో సమ్మెకు దిగారు.







