వరుస సమ్మేలతో బ్రిటన్ లో తీవ్ర అత్యవసర పరిస్థితి ఏర్పడింది.ఎందుకంటే చాలా రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు జరుపుతున్న ఈ వరుస సమ్మెలు ఆందోళనలలో క్రిస్మస్ పండుగ సమయంలో ఆ దేశంలోని ప్రజలలో ఉత్సాహం కూడా కరువైపోయింది.
ప్రధాన రైల్వే యూనియన్ కి చెందిన దాదాపు 40 వేల మందికి పైగా కార్మికులందరూ ఇప్పటికే సమ్మెలో ఉన్నారు.తాజాగా శుక్ర శనివారాల్లో కూడా వీరి సమ్మె కొనసాగినట్లు సమాచారం.
పోస్టల్, నర్సులు, రవాణా కార్మికులు, అంబులెన్స్ డ్రైవర్లు ఇలా అనేక రంగాలకు చెందినవారు సమ్మెకు దిగడంతో దేశవ్యాప్తంగా జనజీవనం అతలాకుతులమైంది.
తమకు వేతనాలు పెంచాలన్నది ఈ సమ్మెలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్ గా ఉంది.
మరో మూడు వారాలపాటు అంటే వచ్చే ఏడాది జనవరి 8 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని రిటర్న్ నేషనల్ రైల్వే ఇప్పటికే చెప్పినట్లు సమాచారం.క్రిస్మస్ రోజున కూడా వదిలి పెట్టకుండా వరుసగా పండుగ మూడు రోజులు సమ్మె జరపాలని రైల్వే యూనియన్ నిర్ణయించింది.రవాణా రంగంలో తీవ్ర అంతరాలు కలిగే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసింది.20 శాతం సర్వీసులు కూడా తిరగకపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

డిసెంబర్ నెల 23, 24 తేదీల్లో క్రిస్మస్ డెలివరీలు ఎక్కువగా ఉండే సమయంలో తమ సమ్మె జరపనున్నట్లు కమ్యూనికేషన్ వర్కర్స్ యూనియన్ కూడా ప్రకటించింది.డిసెంబర్ చివరి రోజుల్లో సివిల్ సర్వీస్ ఇండస్ట్రియల్ యాక్షన్ ఉంటుందని పబ్లిక్ కమర్షియల్ సర్వీస్ యూనియన్ వెల్లడించింది.పండుగ సమయంలో బ్రిటన్ లోకి ప్రవేశించాలనుకునే వారికి ఈ ప్రతిపాదిత సమ్మేలతో ఇబ్బందులు ఉంటాయి.సరిహద్దుల వద్ద వేచి ఉండక తప్పదు అని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే దాదాపు లక్ష మందికి పైగా నర్సులు సమ్మెబాట పట్టినట్లు సమాచారం.కరోనా సమయంలో రాత్రి పగలు అని చూడకుండా శ్రమ పడిన తమ పై ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి తమకు అవమానకరంగా ఉందని నర్సులు చెబుతున్నారు.
సమ్మెకు మించిన పర్యవసనాలు కూడా ఉంటాయని ప్రభుత్వం గుర్తించాలని వారు చెబుతున్నారు.







