మాస్ మహారాజ రవితేజ ఈ స్టేజ్ కు చేరుకోవడానికి చాలా కృషి చేసాడు.మెగాస్టార్ తర్వాత రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ.
ఇక ఇప్పుడు ఉన్న జనరేషన్ లో నాని, విజయ్ దేవరకొండ కూడా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకుని రాణిస్తున్నారు.వీరు మిగతా హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అయితే రవితేజ తన సినిమాల్లో ఇటీవల కాలంలో బ్యాక్ గ్రౌంగ్ గురించి కామెంట్స్ చేస్తూ ఉన్న విషయం తెలిసిందే.తనని తాను ప్రాజెక్ట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది.అయితే ఈయన చెబుతున్న డైలాగ్స్ కథానుసారంగా వస్తున్న అవి ఇండస్ర్టీ లోని వారసులకు ఎక్కడో తగులుతున్నాయి అని గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ చెప్పిన రవితేజ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ధమాకా సినిమాలో కూడా చెప్పిన డైలాగ్ మరోసారి వైరల్ అవుతుంది.
ప్రెసెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో అయినా అన్ని ప్లాప్స్ ను మరిపించేలా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ సినిమాను క్రిస్మస్ బరిలో దింపబోతున్న విషయం తెలిసిందే.డిసెంబర్ 23న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ధమాకా సినిమాలో ”వెనుకున్న వాళ్ళను చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్.వెనుకెవడు లేకపోయినా ముందుకు రావొచ్చు అని ఎగ్జామ్ ఫుల్ సెట్ చేసిన వాడిని” అంటూ ఈయన చెప్పిన డైలాగ్ తగలాల్సిన వారికీ ఎక్కడో తగిలినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇలా ఈయన వరుసగా వారసులపై సెటైర్స్ వేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు.మరి ఈయన కావాలని చేస్తున్నాడా లేదంటే కథలో రాయడం వల్ల చెప్తున్నాడో ఆయనకే తెలియాలి.