వచ్చే ఏడాది సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగబోతోంది.2023 సంక్రాంతి రేస్ కోసం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.ఇక ఈసారి సంక్రాంతికి మన స్టార్ హీరోల్లో ఇద్దరు పోటీకి దిగుతున్న విషయం విదితమే.సీనియర్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడబోతున్నారు.
దీంతో ఈ పోటీ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారిపోయింది.
ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.
ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలోనే రాబోతున్నాయి.దీంతో వీరిద్దరి సినిమాలకు థియేటర్స్ దగ్గర కూడా పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇలా నందమూరి, మెగా హీరో ఒకేసారి రావడం కూడా ఫ్యాన్స్ కు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తుంది.ఇక్కడ మరో విశేషం ఏంటంటే.
ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ నే నిర్మించింది.అయినా వెనక్కి తగ్గకుండా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఈ రేస్ లో దిల్ రాజు తాను నిర్మించిన వారసుడు సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.ఈయన రిలీజ్ చేయడం బాగానే ఉన్న ఇక్కడ సినిమాలను కాదు అని తమిళ్ సినిమా కోసం ఎక్కువ థియేటర్స్ కేటాయించడమే ఇక్కడ ప్రధాన సమస్య.

అదేంటి అని అడిగితే నేనే ముందు సినిమాను ప్రకటించాను అని కౌంటర్ వేస్తున్నాడు.వైజాగ్ లాంటి ఏరియాలో వారసుడు 6 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే.చిరు, బాలయ్య సినిమాలు చేరి 4 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.ఇక్కడ మన తెలుగు సినిమాలకు చాలా మైనస్ అవుతుంది.విజయ్ కు తెలుగులో పెద్ద మార్కెట్ ఏమీ లేదు.కాబట్టి ఆయన సినిమా కోసం దిల్ రాజు ఇలా మెగా, నందమూరి ఫ్యాన్స్ ను నొప్పించేలా రిస్క్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు.
మరి ఈ థియేటర్స్ సమస్య ఎప్పుడు తీరుతుందో చూడాలి.ఇంత పోటీ మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాల్లో చివరకు విన్ అయ్యేది ఎవరో చూడాలి.







