దేశంలో ఎక్కడా లేనివిధంగా బి ఎస్ ఆర్ పార్టీ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చిందని బిఎస్ఆర్ నేతలు తమ ప్రభుత్వ పనితీరు పట్ల రైతుల కోసం తమ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారు.అయితే ఈ పథకాలపై మరికొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఇలాంటి పథకాలు పేద రైతులకు ఇవ్వడం ఎంతో మంచిది కానీ సంపన్నులు కూడా ఇలాంటి పథకాలకు అర్హులు కావడం ఏంటని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి రైతుబంధు పథకాన్ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.
రైతులకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది.అయితే వందల ఎకరాలు భూములు ఉన్నటువంటి సంపన్నులకు కూడా రైతుబంధు డబ్బులను జమ చేస్తున్నారంటూ ఈయన మండిపడ్డారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని నాగార్జునకు హైదరాబాద్లో ఎన్నో వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిసినెస్ లు, వందల ఎకరాల అన్నపూర్ణ స్టూడియో ఉంది.

ఈ విధంగా వందల ఎకరాలు సంపన్నులు అయినటువంటి నాగార్జున కూడా రైతుబంధుకు లబ్ధిదారులు అయ్యారు.వందల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి నాగార్జునకు రైతుబంధు డబ్బులు అవసరమా అంటూ అనుకూరి మురళి ప్రశ్నించారు.అమెరికాలో కొన్ని సంవత్సరాలుగా స్థిరపడిన వారికి తెలంగాణలో వందల ఎకరాలు భూములు ఉన్నా కూడా వారు కూడా ఈ పథకానికి లబ్ధిదారులు అయ్యారని ఈయన తెలిపారు.
వ్యవసాయం చేయనటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు సంపన్నులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అంటూ ఈయన రైతుబంధు పథకంపై తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు.







