ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూసిన అవతార్ 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది.
ఇక శనివారం కచ్చితంగా ఈ సినిమా 50 కోట్ల ను మించి కలెక్ట్ చేస్తుందని అంతా భావించారు.అన్నట్లుగానే రెండవ రోజు శనివారం అవ్వడం తో ఏకంగా 55 కోట్ల రూపాయల కలెక్షన్స్ అవతార్ 2 సినిమా కి వచ్చాయని బాక్స్ ఆఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
మొదటి రెండు రోజుల్లోనే అవతార్ 2 సినిమా ఏకంగా 85 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు నమోదు చేయడం తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం కంటిన్యూ అవుతుంది.ఇక ఆదివారం కూడా కచ్చితంగా 50 కోట్ల రూపాయల కు తగ్గకుండా కలెక్షన్స్ ఉండే అవకాశం ఉందని బాక్సాఫీస్ వరకు మాట్లాడుకుంటున్నారు.
దీన్ని బట్టి చూస్తే మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 130 నుండి 135 కోట్ల రూపాయలు నమోదు చేసినట్లు చెప్పుకోవచ్చు.
![]()
అయితే ఈ సినిమా కలెక్షన్స్ అవెంజర్స్ సినిమా కలెక్షన్స్ తో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి.ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అవతార్ 2 భారీగా కలెక్షన్స్ నమోదు అయితే చేస్తుంది.కానీ ఆ రికార్డు ని బ్రేక్ చేయలేక పోయింది.
లాంగ్ రన్ లో అయిన ఈ సినిమా ఆ రికార్డు ని బ్రేక్ చేసిందేమో చూడాలి.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపుగా మొదటి రెండు రోజుల్లోనే 20 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
భారత దేశం వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లోనే కలెక్షన్స్ నమోదు అవుతున్నట్లు బాక్సాఫీస్ వరకు చెబుతున్నారు.వచ్చే వారంలో ధమాకా సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
కనుక అప్పటి వరకు ఈ సినిమా సాధ్యం అయినంత ఎక్కువ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.






