వారసుడు.గత కొద్దిరోజులు సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.
ఇందులో హీరోగా విజయ్ నటిస్తుండగా నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సినిమా ఇప్పటికీ ఎన్నో రకాల కాంట్రవర్సీలను ఎదుర్కొంటూనే ఉంది.
ఒక దాని తర్వాత మరొకటి వివాదాలు ఈ సినిమా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.ఒక వివాదం సద్దుమణిగింది అనుకునే లోపే మరొక వివాదం తెరపైకి వస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా దిల్ రాజు విజయ్ అజిత్ ని పోల్చుతూ ఒక మాట అన్న విషయం తెలిసిందే.అయితే ఈ వివాదం చల్లారే లోపు వారసుడు సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
అదేమిటంటే.తాజాగా విజయ్ అజిత్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా నిర్మాత దిల్ రాజు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో వారసుడు సినిమాకి తెలుగులో ఎవరు సూట్ కాకపోవడం వల్ల హీరోగా చేయడానికి విజయ్ ని తీసుకొస్తున్నారా అనే ప్రశ్న ఎదురైంది.ఈ విషయంపై స్పందించిన నిర్మాత దిల్ రాజు.వంశీ స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఇది మహేశ్ బాబుతో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకో సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యమైంది.
ఆ తర్వాత రామ్ చరణ్ తో అనుకున్నాము.కానీ అప్పుడు svc 50 ఫైనల్ కావడం వల్ల చేయలేకపోయాము.
అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఆ టైంలో బిజీగా ఉన్నారు.

ఎవరు ఫ్రీగా లేరు.అప్పుడు విజయ్ ని కలిశాము.అరగంట స్టోరీ విన్న ఆయనకు నచ్చడం వల్ల సినిమా ఓకే చేశారు అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
అయితే నెటిజన్స్ ఈ విషయం పై స్పందిస్తూ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.దిల్ రాజు మాటలను బట్టి చూస్తే వారసుడు సినిమా కోసం ఫస్ట్ ఛాయస్ విజయ్ కాదని, అలాగే ఎంతో మంది హీరోలకు సమయం కుదరకపోవడంతో చివరికి విజయకు ఈ కథ ఓకే చేసారని అర్థం అవుతోంది.







