భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.ఆయన పార్టీలో ఉన్నా , లేనట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో పాటు, పార్టీ మారే ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
పార్టీ సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ పార్టీ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉండేది.అయితే కొద్ది నెలల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు.
ఆ తర్వాత మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగినాయి.ఆ ఎన్నికల్లో బిజెపి తరఫున రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు.
అయితే ఎన్నికల సందర్భంగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవడానికి వెంకట్ రెడ్డి ప్రయత్నాలు చేయడం, దానికి సంబంధించిన ఆడియో లీక్ కావడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం చెందిన కాంగ్రెస్ అధిష్టానం వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసింది.
ఇక ఆ తర్వాత ఏఐసిసి పెద్దలతో వెంకటరెడ్డి ఇటీవలే భేటీ అయ్యారు. ఇక ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ కమిటీల్లోను వెంకటరెడ్డికి ప్రాధాన్యం కల్పించలేదు .దీంతో ఆయన కాస్త అసంతృప్తి చెందరు.అయితే అనూహ్యంగా వెంకటరెడ్డి ప్రధాని నరేంద్ర మోది తో భేటీ కావడం చర్చనీయంశంగా మారింది.
నిన్ననే ఆయన ప్రధానితో దాదాపు 20 నిమిషాలకు పైగా అనేక అంశాలపై చర్చించారు.అయితే తాను కేవలం నవామి గంగా మాదిరి , మూసి ప్రక్షాళన చేపట్టాలని కోరానని , దానికి ఆయన కమిటీ వేస్తానని హామీ ఇచ్చారని , దీంతో, పాటు హైదరాబాద్ , విజయవాడ జాతీయ రహదారి విస్తరణ, జనగాం భువనగిరి మధ్య ఎంఎంటీఎస్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెంకటరెడ్డి తెలిపారు.

అయితే పార్టీ మార్పు వ్యవహారంతో మాత్రం ఆయన సూటిగా స్పందించలేదు.ఎన్నికల సమయంలోనే తన నిర్ణయం ఏంటో ప్రకటిస్తానంటూ వెంకటరెడ్డి చెప్పడంతో ఆయన పార్టీ కచ్చితంగా మారుతారని , దానికి ముందుగానే ఈ విధమైన హింట్ ఇస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మొదలయ్యాయి.పార్టీ సీనియర్ నేతగా ఉన్న తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా రేవంత్ వర్గానికి కమిటీల్లో పెద్ద పీట వేయడం వంటివి వెంకటరెడ్డి కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించినట్టుగా అర్దం అవుతోంది.








