ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి, బిజెపి పార్టీకి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.ఇందుకు గల కారణం కూడా లేకపోలేదు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దీపికా పదుకొనే నటించిన తాజా చిత్రం పఠాన్.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్స్ విడుదలైన విషయం తెలిసిందే.ఆ సాంగ్స్ లో ఒక పాటలో దీపికా ఒక కాషాయ రంగు బికినీ డ్రెస్ ను ధరించి అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.
అయితే దీపికా వేసుకున్న కాషాయ రంగు బికినీతో అసలు సమస్య మొదలైంది.
కాషాయ రంగు దుస్తులను ధరించి ఎలా రొమాంటిక్ సీన్లు చేస్తారు అంటూ తాజాగా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మండిపడిన విషయం తెలిసిందే.
ఆ సినిమాలోని సన్నివేశంలో అలాగే ఆ డ్రెస్ తొలగించకపోతే సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని మీడియా ముందు తెలిపారు.అయితే ఇదే విషయాన్ని బిజెపి పార్టీ పెద్దదిగా చేసి వివాదాన్ని సృష్టిస్తుంది అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దీపికా పదుకొనే కంటే ముందు కాషాయ రంగు దుస్తులు ధరించిన హీరోయిన్ల ఫోటోలను షేర్ చేస్తూ అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కూడా ఈ వివాదంలోకి లాగారు.స్మృతి ఒకప్పుడు మోడల్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆమె 1998లో మిస్ ఇండియా పోటీలను కాషాయ రంగు బికినీ వేసుకొని క్యాట్ వాక్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ దీపిక అభిమానులు బిజెపి పార్టీని ప్రశ్నిస్తున్నారు.ఇంకొందరు బిజెపి కావాలని ఈ బికినీ వివాదాన్ని మరింత రెచ్చగొడుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ వివాదం ఇంకా ఎంత వరకు వెళ్తుందో చూడాలి మరి.







