బిగ్ బాస్ సీజన్ 6 నుంచి 15వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది.ఈసారి శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యింది.
మరో రెండు రోజుల్లో షో ముగుస్తుంది అనగా ఆమె ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది.శ్రీ సత్య టాప్ 5 కంటెస్టంట్ కాదా అంటే అవును కానీ ఆమెకన్నా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టే ఆమె హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీ సత్య తన ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పించింది.
దాదాపు 15 వారాల పాటు ఉన్న శ్రీ సత్య రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుందని టాక్.
వారానికి లక్ష రూపాయల డీల్ తో సెట్ చేసుకుని హౌస్ లో 15 వారాలు తన ఆట తీరుతో మెప్పించిన శ్రీ సత్య సీజన్ మొత్తం మీద 15 లక్షల దాకా రెమ్యునరేషన్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.చివరి వారం అది కూడా మరో రెండు రోజులు కూడా ఉండి ఉంటే బాగుండేదని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ గా రేవంత్, రోహిత్, ఆది రెడ్డి, కీర్తి, శ్రీహాన్ లు నిలిచారు.







