పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తర్వాత ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా కమిట్ అయ్యే పరిస్థితి లేదని.ఇప్పటికే కమిట్ అయిన కూడా ఆయన షూటింగ్ లో పాల్గొనే పరిస్థితి లేదు అంటూ మొన్నటి వరకు చిత్ర సినీ రంగ ప్రముఖులు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ తాజాగా పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది.ఒక వైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే మరో వైపు సాహూ దర్శకుడు సుజిత్ దర్శకత్వం లో ఒక సినిమా ను అధికారికంగా ప్రకటించాడు.
ఆ ఒక్క సినిమా చేస్తాడేమో అనుకుంటూ ఉండగా అనూహ్యంగా హరిష్ శంకర్ దర్శకత్వం లో సినిమా ను ప్రకటించడం తో పాటు షూటింగ్ కూడా మొదలు పెట్టాడు.దాదాపు వారం రోజుల షెడ్యూల్ ముగించిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్ ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.
గత కొంత కాలం గా తమిళం లో సూపర్ హిట్ అయిన వినోదయ్య సిత్తం అనే సినిమా ను రీమేక్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

అన్నట్లుగానే సముద్రఖని దర్శకత్వం లో సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో ఆ సినిమా ని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.వినోదయ్య సిత్తం తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.కనుక ఇక్కడ కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకం తో పవన్ కళ్యాణ్ రీమేక్ కి ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
గతం లో పవన్ కళ్యాణ్ నటించిన రీమేక్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కనుక సెంటిమెంట్ తో రీమేక్ లనే పవన్ కళ్యాణ్ ఎక్కువ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.







