నాకు పవన్ కు గ్యాప్ రాలేదు... గ్యాప్ క్రియేట్ చేశారు... అలీ షాకింగ్ కామెంట్స్!

ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కొన్ని వందల సినిమాలలో హీరోగా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆలీ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు.

 I Didnt Get A Gap To Pawan They Created A Gap Alis Shocking Comments , Ali , Su-TeluguStop.com

ప్రస్తుతం సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారాడు.అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా అనే టాక్ షో కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

ప్రతి వారం ప్రసారం అవుతున్న ఈ షోలో సెలబ్రిటీలతో అలీ చేసే సందడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.దీంతో ఈ షో మంచి టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతోంది.

ఇదిలా ఉండగా తాజాగా వచ్చేవారం ప్రసారం కానున్న అలీతో సరదాగా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది.

ఈ ఎపిసొడ్ లో స్టార్ యాంకర్ సుమ గెస్ట్ గా హాజరై సందడి చేసింది.ఇద్దరు కలిసి చాలా విషయాలు చర్చించుకున్నారు.ఇక సుమ ఎప్పటిలాగే తన మాటలతో అందరినీ నవ్వించింది.ఇక అలీ కూడా తనదైన శైలిలో సుమని ప్రశ్నిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇదిలా ఉండగా.

ఇక ఈ ప్రోమోలో తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మధ్య విభేదాలు రావడానికి గల కారణాల గురించి అలీ తెలియజేసే ప్రయత్నం చేశాడు.గతంలో 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ సమయంలో అలీ వైసీపీ పార్టీకి మద్దతుగా నిలవడం వల్ల అలీకి, పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు మొదలయ్యాయి.

అప్పటినుండి వీరిద్దరి మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతుంది.

ఇక తాజాగా జగన్ ప్రభుత్వం అలీ కి ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జ్ గా పదవిని కట్టబెట్టింది.ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అలీ పెద్ద కూతురి వివాహ మహోత్సవానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ హాజరయ్యారు.చిరంజీవి సురేఖ జంట కూడా హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.

అయితే ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవటంతో మరొకసారి ఈ ప్రశ్న తెరపైకి వచ్చింది.ఇక ఇటీవల అలీతో సరదాగా షోలో పాల్గొన్న సుమ అలీ స్థానంలోకి వెళ్లి అలీని ప్రశ్నించింది.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ కి మీకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడగగా. గ్యాప్ రాలేదు క్రియేట్ చేశారు అంటూ అలీ సమాధానం చెప్పాడు.

నా కూతురు పెళ్లికి కూడా పవన్ కళ్యాణ్ వస్తానని చెప్పాడు కానీ ఫ్లైట్ మిస్ అవ్వటంతో రాలేకపోయాడు అంటూ క్లారిటీ ఇచ్చాడు.అలీ గ్యాప్ క్రియేట్ చేశారు అని చెప్పడంతో ఆ గ్యాప్ క్రియేట్ చేసిన వారు ఎవరు అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube