జేమ్స్ కామెరూన్.సినిమా దర్శకుడు అని చెప్తే చాల చిన్న పదం.అతడిని ఇంద్రజాలికుడితో పోల్చాలి.తన మైండ్ కి ఏది వస్తే అది సినిమా తీయాలి అని అనుకుంటాడు.
అందుకోసం ఎన్ని ఏళ్లయినా విశ్వసాన్ని మాత్రం పెంచుకుంటాడు .నమ్మకాన్ని కోల్పోడు.అదే స్థాయిలో దాని కోసం కష్టపడతారు.ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా అని సినిమా ఇండస్ట్రీ లో చాల మంది ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, అది సహజమే.
కానీ ఒక్క దర్శకుడు తనకు వచ్చిన ఆలోచన కోసం ఇన్నేళ్ల పాటు ఎదురు చూడటం అంటే నిజంగా గొప్ప విషయమే.దాని కోసం సాంకేతికంగా ఎన్నో ఏళ్ళ పాటు శ్రమించి, వేళా కోట్ల బడ్జెట్ సమకూర్చడం అంటే చాల గొప్ప విషయం.
ఫలితం ఎలా ఉన్న ప్రయత్నం చేయడం లో వంద మంది రాజమౌళి లతో సమానం జేమ్స్ కెమరూన్.ఇక సినిమా సిద్ధం చేసాక ఫలితం నెగటివ్ గా ఉంటె కలెక్షన్స్ తక్కువ వస్తాయేమో అనే భయం లేదు అతడికి.
అందరికి వేసి మరి చూపించాడు అయినా రావాల్సిన నెగటివిటీ రానే వచ్చింది.అవతార్ తో పోలిస్తే అస్సలు పనికి రాదు అంటూ చాల కామెంట్స్ వినిపించాయి.అయినా కూడా అసలు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి తీసిన గ్రాఫిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనే కోణం లో చూడటానికి కొన్ని కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు.ఇక్కడ పాన్ ఇండియాలో లేదా తెలుగు లో చవకబారు గ్రాఫిక్స్ తో వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా కంటే అవతార్ సీక్వెల్ లో ఎలాంటి కొత్తదనం కనిపించబోతుందో అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది.
ఒక జానపదాన్ని పోలిన ది వే ఆఫ్ వాటర్ ని తీసిన విధానం అయితే మాత్రం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.మూడు గంటల పాటు ఉన్న రన్ టైం పట్ల కొంత మంది మాత్రం పెదవి విరిచారు.అన్నేసి గంటలు ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోబెట్టగలరా లేదా తెలియాల్సి ఉంది.ఇంత పెద్ద మొత్తంలో గ్రాఫిక్స్ ఉన్నప్పటికి ప్రతి సినిమాలోనూ కంటెంట్ పక్కాగా ఉండేలా చూసుకుంటాడు జేమ్స్ కామెరూన్ అలాగే ఎమోషన్స్ కూడా బాగా పండే అవకాశం ఉంది.
అందుకే ఖచ్చితంగా ఒక్కసారి థియేటర్ కి వెళ్లి సినిమా చూసి ఎలా ఉందొ చూస్తే మంచిది పనికి మాలిన రివ్యూ లను పట్టించుకోకుండా.






