టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అనుష్క అంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కడి లేని అభిమానం చూపిస్తారు.ఇక అనుష్క తన అందంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది.
ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా ఈ మధ్య అనుష్కకు అంతగా కలిసి రాలేకపోతుంది.
అనుష్క తొలిసారిగా సూపర్ సినిమాతో పరిచయమైంది.పైగా తొలిసారి నటనతోనే తన అందాల గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్క ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.ఇక ఈమె నటించిన అరుంధతి సినిమాతో మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి పలు సినిమాలలో నటించింది.కానీ తెలుగులోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.కానీ ఆ తర్వాత అనుష్కకు అంతగా కలిసి రాలేదు.నిజానికి అనుష్క కెరీర్ కొంత వరకు నాశనం కావడానికి సైజ్ జీరో, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలే కారణమని చెప్పవచ్చు.

ఈ సినిమాల తర్వాత మళ్లీ మంచి సక్సెస్ కావటానికి తెగ ప్రయత్నించింది అనుష్క.గతంలో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండగా నిశ్శబ్దం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.కానీ ఈ సినిమా కూడా అనుష్కను నిరాశపరిచింది.ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది.ఇక అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగినప్పటినుంచి తన పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఎంతోమంది ఎన్నో ఇంటర్వ్యూలలో అనుష్కను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని ఎన్నోసార్లు ప్రశ్నించారు.
కానీ అనుష్క మంచిగా సెటిల్ అయిన తర్వాతనే అని చెప్పి తప్పించుకునేది.ఇక గతంలో ప్రభాస్ ని కూడా పెళ్లి చేసుకుంటుందని వారి మధ్య లవ్ నడుస్తుందని ఎన్నో పుకార్లు వినిపించాయి.
అంతేకాకుండా వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా వారికి ప్రశ్నలు ఎదురవ్వగా కేవలం స్నేహితులమనే చెప్పుకొని తిరిగే వాళ్ళు.

కానీ ఇప్పటికీ తెలుగు అభిమానులు అనుష్క, ప్రభాస్ ను జంటగా చూడాలని కోరుకుంటూనే ఉన్నారు.ఇక అనుష్క సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఎప్పుడో ఒకేసారి ఫోటోలను షేర్ చేస్తుంది.
అయితే తాజాగా ఒక ఫోటో షేర్ చేయగా అందులో చెఫ్ గా కనిపించింది.దీంతో ఆ ఫోటో లో అచ్చం తాను వంటలక్క గా అందంగా కనిపించింది.
అయితే అది ఓ సినిమాకు సంబంధించిన లుక్ అని తెలుస్తుంది.ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.ఇక ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం.అన్న ఫుడ్ లవర్.
వదిన వంటలక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక ప్రభాస్ అభిమాని.
ప్రభాస్ అన్నను పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ రిక్వెస్ట్ చేశారు.ప్రస్తుతం ఆ కామెంట్స్ బాగా వైరల్ అవుతుంది.







