తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే గ్రాండ్ ఫినాలే కి చేరుకుంది.మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 6 షో ముగియనుంది.
గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ దగ్గర పడుతుండడంతో అభిమానులతో బిగ్ బాస్ ప్రేమికులతో పాటు టాప్ సిక్స్ లో ఉన్న కంటెస్టెంట్లు కూడా ఫుల్ ఖుషి గా ఉన్నారు.ఇక టాప్ సిక్స్ లో కంటెస్టెంట్స్ లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి మిగిలిన ఐదుగురిని ఫినాలేకి పంపించనున్నారు.
ఇక ఫినాలే ఎపిసోడ్ దగ్గర పడుతుండడంతో తాజాగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఓటు అప్పీల్ కోసం ఆఖరిపోరాటం అనే టాస్క్ ను ఇచ్చాడు.
ఈ నేపథ్యంలోనే సౌండ్స్ విని వాటిని గుర్తుపట్టి అవేంటో రాయాలి అని చెప్పాడు.
ఆఖరిపోరాటం టాస్క్ లో భాగంగా ఆదిరెడ్డి రోహిత్ లో ఎక్కువ పాయింట్స్ సంపాదించుకున్నారు.ఇక వారిద్దరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఓటు అప్పీల్ కోసం ఎంపిక చేయమని ఆదేశించాడు బిగ్ బాస్.
అయితే ప్రతిసారి ఏకాభిప్రాయం అన్నప్పుడు రోహిత్ ని పక్కన పెట్టుకుంటూ వచ్చిన హౌస్ మేట్స్ ఈ ఒక్కసారి కి మాత్రం అతనికి అవకాశం ఇచ్చారు.అప్పుడు రోహిత్ 15 వారాలుగా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తానన్న నమ్మకం ఉంది అని ధీమా వ్యక్తం చేశాడు.
అనంతరం మరొక టాస్క్ లో రేవంత్, శ్రీ సత్య ఇద్దరు ముందు స్థానాల్లో నిలిచారు.

ఇక వారిద్దరిలో కూడా రేవంత్ కి ఆదిరెడ్డి సపోర్ట్ చేయగా, శ్రీ సత్య కి శ్రీహాన్ సపోర్ట్ చేశాడు.ప్రస్తుతం ఇందుకీ సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే టాప్ సిక్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఆదిరెడ్డి రేవంత్ ఇద్దరూ చివరి రెండు స్థానాల్లో ఉన్నారు.
వీరిద్దరిలో నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి మిగిలిన ఒకరు టాప్ ఫైవ్ లోకి చేరుకోనున్నారు.మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరి ఫైనల్ కి చేరుకుంటారు అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.







