సరిగ్గా పది సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో కొన్ని దేశాలు తమ దేశాలకు చెందిన అమ్మాయిలను ఇండియాలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా అప్పట్లో చేయడం జరిగింది.
ఓ అమ్మాయి పై ఢిల్లీ నడిబొడ్డున సామూహిక అత్యాచారం చేసి అతికిరాతకంగా చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
చట్టసభలను సైతం కుదిపేసింది.
దీంతో దేశంలో నిర్భయ పేరుతో చట్టం రావడం జరిగింది.తర్వాతి కాలంలో ఆ రీతిగా అమ్మాయి లపై ఘటనలకు పాల్పడిన వారిని నిర్భయ చట్ట ప్రకారం దోషులకు శిక్షలు ఖరారు అవుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే.నిర్భయ ఘటన జరిగి నేటికి పది సంవత్సరాలైనా గాని దేశంలో పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని నిర్భయ తల్లిదండ్రులు తెలియజేశారు.

నిర్భయకు తప్ప ఎవరికి న్యాయం జరిగిందని తాను అనుకోవటం లేదని నిర్భయ తల్లి పేర్కొన్నారు.ఇప్పటికీ కూడా దేశంలో మహిళకు భద్రతా లేదని నిర్భయ తండ్రి బద్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో నేరగాళ్లు రోజురోజుకి నేరాలకు పాల్పడుతూనే ఉన్నారని పేర్కొన్నారు.







