ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ తరువాత మొదటిసారి పిక్ షేర్ చేసిన ఉపాసన.. అత్తమ్మని మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్?

కొణిదెల వారి కోడలు, హిరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురించి అందరికి పరిచయమే.రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.

 Upasana Shared A Pic For The First Time After The Pregnancy Confirmation Is Emot-TeluguStop.com

మెగా ఇంటి కోడలిగా కంటే సొంత గుర్తింపుతో తెలుగు ప్రజలకు పరిచయమైంది.ఇక ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఉపాసన పెళ్లికి ముందు రామ్ చరణ్ ను ఓ మీటింగ్ లో కలవడంతో ఆ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగింది.అలా వారి మధ్య ప్రేమ పుట్టగా కొంతకాలం తర్వాత రామ్ చరణ్ సమయం చూసుకొని చెప్పటంతో వెంటనే చిరంజీవి ఓకే అనేసి ముహూర్తాలు పెట్టాడు.

అలా వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు 2012 లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు.

పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపించింది.

ఇప్పటికీ ఈ జంట అంతే అన్యోన్యంగా ఉన్నారు.ఇక వీరి పెళ్లి అయ్యి పదేళ్లు పూర్తవగా మొన్నటివరకు వీరికి పిల్లలు లేరని తమ అభిమానులు చాలా బాధపడతారు.

కానీ ఇటీవలే ఉపాసన, రామ్ చరణ్ తాము తల్లిదండ్రులు అవుతున్నామని ప్రకటించడంతో వెంటనే కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా బాగా సంతోషపడుతారు.

ఇక ఉపాసనకు మాత్రం తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి.మామకు తగ్గ కోడలు అని చాలా మంది ప్రశంసలు కురిపించారు.పైగా ఉపాసన సోషల్ సర్వీస్ లలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

ప్రతి ఒక్క విషయంలో తను బాగా స్పందిస్తుంది.ఉపాసన సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

సోషల్ మీడియా వేదికను ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలకే కాకుండా ప్రజలకు అవసరమయ్యే విషయాలను కూడా చెప్పడానికి కూడా బాగా వాడుతుంది.

చాలావరకు హెల్త్ టిప్స్ గురించి బాగా వివరిస్తుంది.గతంలో ఉపాసన కోవిడ్ సమయంలో తన హాస్పిటల్ తరఫున ఎంతోమందికి సహాయం చేసింది.అయితే ఇదంతా పక్కన పెడితే మొత్తానికి మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మొదటిసారి తన ఫోటో షేర్ చేసుకుంది.

అంతేకాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన ఫోటోను కూడా పంచుకుంది.ఆ ఫోటోలో తను ఒక విషయాన్ని పంచుకుంది ఉపాసన.తన తల్లి గారి ఇంటికి వెళ్లి అందరి ఆశీర్వాదాలు తీసుకున్న ఉపాసన తన అత్తమ్మని మిస్ అవుతున్నట్లు తెలుపుతూ కాస్త ఎమోషనల్ గా ఫీల్ అయింది.ఇక ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవ్వగా.

తన ఫోటోలను చూసిన మెగా అభిమానులు బాగా తిను వదిన అంటూ.బుల్లి రామ్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఆ ఫోటోలో ఉపాసన చాలా సన్నబడినట్లు కనిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube