టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నటి సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోగా నటిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.
గతేడాది విడుదలైన అఖండ సినిమా భారీ విజయం అందుకోవటంతో బాలకృష్ణ తన స్పీడ్ మరింత పెంచాడు.ఇలా వరుస సినిమాలలో నటించడమే కాకుండా ప్రముఖ ఓటిటి ఛానల్ ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోలో హోస్టుగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది.ఎంతోమంది స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో చేసి మంచి హిట్ అందుకున్నారు.అయితే బాలకృష్ణ మాత్రం ఎలా మల్టీ స్టార్ సినిమాలు చేయకపోవటానికి గల కారణాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.గతంలో బాలకృష్ణ ఎన్నో మల్టీస్టారర్ సినిమాలలో నటించాడు.
అయితే అప్పట్లో ఆయన నటించిన సినిమాలు సరైన హిట్ అందుకోకపోవడం వల్లే బాలకృష్ణ మల్టీ స్టారర్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా మల్టీస్టారర్ సినిమాలలో నటించడం వల్ల సినిమా మంచి హిట్ అయినా కూడా మెయిన్ హీరోకు పూర్తిస్థాయిలో క్రెడిట్ దక్కదు.
అందువల్ల బాలయ్య మల్టీస్టారర్లకు దూరంగా ఉంటున్నట్టు టాక్.

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న “వీరసింహారెడ్డి” సినిమా షూటింగ్ పనులలో బాలకృష్ణ బిజీగా ఉన్నాడు.ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెంచాయి.
అఖండ ఘనవిజయం సాధించటంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది.







