శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి.ఈ గొడవలతో వివాదం రచ్చకెక్కినట్లు తెలుస్తోంది.
హిందూపురంలోని వైసీపీ నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారు.ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గం, ఏపీ ఆగ్రో ఛైర్మన్ నవీన్ నిశ్చల్ వర్గంతో పాటు చౌలూరు మధుమతి వర్గంగా నేతలు, కార్యకర్తలు విడిపోయారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పార్టీ నియోజకవర్గ సమావేశంలో నాయకులు తాడోపేడో తేల్చుకుంటామని చెబుతున్నారు.గ్రూపు తగదాలు రచ్చకెక్కడంతో మంత్రి పెద్దిరెడ్డి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన హిందూపురం పార్టీ నేతలతో సమావేశం అయ్యారని సమాచారం.