తెలుగు పేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో లేడీ టైగర్ ఎవరు అంటే చాలు ఇనయా అనే చెప్పేస్తూ ఉంటారు.
బిగ్బాస్ షో నుంచి ఆమె ఎలిమినేట్ కాకముందే భారీగా పాపులారిటిని సంపాదించుకుంది ఇనయ.అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ అందరూ ఒక్కటై ఆమెను టార్గెట్ చేసినప్పటికీ ఆమె ఏ మాత్రం వెనకడుగు చేయకుండా అదే ధైర్యంతో ముందడుగు వేసి 13 వారాలపాటు హౌస్ సక్సెస్ఫుల్గా కొనసాగిందీ.అయితే ప్రేక్షకుల అంచనాల ప్రకారం ఇనయా టాప్ 2 లేదా టాప్ 5 లో ఉంటుంది అని అనుకున్నారు.
కాని కనీసం ఆమె టాప్ ఫైవ్ లో కూడా లేకుండా అనూహ్యంగా ఆమెను ఎలిమినేట్ చేసి బయటకు పంపించిన విషయం తెలిసిందే.
అయితే ఇనయాను ఎలిమినేట్ చేయడంతో బిగ్ బాస్ షో వద్ద గతంలో ఎన్ని రోజులు లేనివిధంగా ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.ఇనయాను ఎలిమినేట్ ఎలా చేస్తారు అంటూ మండి పడ్డారు అభిమానులు.
ఇనయా ఎలిమినేషన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.ఆమెది ఫేక్ ఎలిమినేషన్ ఇంతటి ప్రజాదరణ ఉన్న కంటెస్టెంట్ ఎలా ఎలిమినేట్ అవుతుంది.
ఓట్లతో సంబంధం లేకుండా ఇనయాను ఎలిమినేట్ చేశారంటూ ధ్వజమెత్తారు.

మరో ప్రక్క కేవలం ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెబుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఇనయా కు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త అభిమానులను షాక్ కి గురి చేస్తోంది.అదేమిటంటే ఇనయా గతంలోని పెళ్లి అయిందట.
సోషల్ మీడియాలో తాజాగా ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది.ఆ ఫోటోలు ఆమె పద్ధతిగా నగలు వేసుకుని చీర కట్టుకొని ఉండగా ఆమె పక్కన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు .ఈ వార్తపై నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.







