తెలుగు ప్రేక్షకులకు సినీ ప్రేక్షకులకు తమిళ హీరో ఉదయనిది స్టాలిన్ గురించి ప్రత్యేకంగా లేదు.కేవలం తమిళంలోనే మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యాడు ఉదయనిది స్టాలిన్.
కాగా ఉదయనిది స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఏంకే స్టాలిన్ తనయుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఉదయనిది స్టాలిన్ తీసుకున్న ఒక షాకింగ్ నిర్ణయం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
అదేమిటంటే ఇకపై తాను సినిమాలలో నటించడం లేదని ప్రకటించి ఒకసారిగా అభిమానులకు షాక్ ఇచ్చాడు.
రాజకీయాలతో బిజీ బిజీగా ఉండటం వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.
తాజాగా తమిళనాడు క్రీడాశాఖ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.
ఇక మీదట సినిమాల్లో నటించను.కమల్ హాసన్ సర్ బ్యానర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది.
కానీ ఆ సినిమా నుంచి కూడా తప్పుకుంటున్నాను.మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న మామన్నాన్ నా చివరి చిత్రం అని తెలిపారు ఉదయనిది స్టాలిన్.
ఇకపోతే ఉదయనిది స్టాలిన్ కెరియర్ విషయానికి వస్తే.మొదట 2012లో ఒరు కాల్ ఒరు కన్నడి సినిమాతో సిని ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఉదయనిది స్టాలిన్.

మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయనిది స్టాలిన్ ఆ తర్వాత తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకున్నాడు.మొదటి తర్వాత ఇతర సినిమాలలో నటించకూడదు అనుకున్న ఉదయినిది స్టాలిన్ కు వరుసగా అవకాశాలు రావడం, ఆ కథలు కూడా ఆయనకు నచ్చడంతో సినిమాలు చేసుకుంటూ పోయాడు.అలాగే రెడ్ జియాంట్ మూవీస్ నిర్మాణ సంస్థ ద్వారా పలు సినిమాలు నిర్మించారు ఉదయనిది స్టాలిన్.కాగా ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 మూవీ కూడా ఈ బ్యానర్‌లో నిర్మితమవుతోంది.







