YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ పోలీసు శాఖ అనుమతులు ఇవ్వకపోవడం తెలిసిందే.పాదయాత్ర మళ్లి స్టార్ట్ అయితే శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
మరోపక్క న్యాయస్థానం అనుమతి ఇచ్చిన గాని పాదయాత్రకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై షర్మిల సీరియస్ అవుతున్నారు.ఈ తరుణంలో తెలంగాణ పోలీస్ శాఖ పై కేసు వేస్తానని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను అడుగడుగున పోలీసులు నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు.
పార్టీ కార్యాలయానికి కార్యకర్తలను కూడా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తన వ్యక్తిగత హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సంక్రాంతి తర్వాత పాదయాత్ర ఆగిన చోటే మొదలు పెడతానని స్పష్టం చేశారు.
అంతేకాదు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాను పాలేరు నుంచి పోటీ చేయబోతున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. ఇటీవల తనని పాదయాత్రకి అనుమతించకపోవడంతో షర్మిల ఆమరణ నిరాహారదీక్ష చేయటం తెలిసిందే.
ఈ క్రమంలో ఆమెను లోటస్ పాండ్ కి పోలీసులు తరలించారు.అయినా గాని అక్కడ కూడా దీక్ష కొనసాగించడం జరిగింది.ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించటంతో బలవంతంగా పోలీసులు అపోలో ఆసుపత్రికి తరలించారు.కాగా ఇటీవల ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది.ఈ తరుణంలో పాదయాత్రకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతూ పోలీసు శాఖపై కేసు వేస్తానని షర్మిల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.