పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి వాహనం కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారనే సంగతి తెలిసిందే.ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ కాదని పలువురు వైసీపీ నేతలు కామెంట్లు చేసినా ఎమరాల్డ్ గ్రీన్ కలర్ తో తయారైన ఈ వాహనానికి తెలంగాణలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తైంది.
8384 అనే నంబర్ తో ఈ వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి కాగా ఈ వాహనానికి పుష్ప మూవీకి లింక్ ఉందని పవన్, బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు.
పుష్ప ది రైజ్ సినిమాలోని ఒక సన్నివేశంలో అల్లు అర్జున్ ఫోన్ నంబర్ చెబుతూ చివరి నాలుగు అంకెలు 8384 అని చెబుతాడు.
పవన్ కళ్యాణ్, బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో పవన్ వారాహి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, బన్నీ ఫోన్ నంబర్ సేమ్ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ ఈ వాహనంలోనే ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
ఎన్నో అత్యాధునిక ఫీచర్లతో తయారైన ఈ వాహనం పవన్ ఎన్నికల ప్రచారానికి కచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్ భద్రత కోసం ఎన్నో సెక్యూరిటీ ఫీచర్లతో ఈ వాహనం సిద్ధమైందని సమాచారం అందుతోంది.ఈ వాహనానికి అమర్చి ఉన్న సీసీ కెమెరాలు ప్రతిదీ రికార్డ్ చేస్తాయని సమాచారం.హైడ్రాలిక్ మెట్లు ఈ వాహనానికి ఉన్న మరో ప్రత్యేకత అని చెప్పవచ్చు.అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలకు ఎన్ని రోజుల సమయం కేటాయిస్తారనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.తక్కువ రోజులు షూటింగ్ లో పాల్గొనే కథలకు మాత్రమే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పవన్ ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.