మామూలుగా కొన్ని కొన్ని సార్లు కొంతమంది బుల్లితెర సెలబ్రిటీలు హీరోయిన్స్ లాగా కనిపిస్తూ ఉంటారు.గ్లామర్ షో చేస్తూ అచ్చం హీరోయిన్ లను పోలి ఉంటారు.
నిజానికి కొన్ని కొన్ని సార్లు వాళ్ళ ముఖచిత్రాలు ఇతరుల హీరోయిన్లను పోలి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి.అలా ఇప్పటికీ కొంతమంది బుల్లితెర సెలబ్రిటీలు ఇతర హీరోయిన్స్ లాగా కనిపించారు.
తాజాగా జబర్దస్త్ వర్ష కూడా సమంత లాగా కనిపిస్తుంది అంటూ తన ఫాలోవర్స్ బాగా రచ్చ చేస్తున్నారు.కానీ నెటిజన్స్ మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
బుల్లితెరపై సీరియల్స్ లో అడుగుపెట్టిన వర్ష కేవలం సీరియల్స్ చూసే ప్రేక్షకులకు మాత్రమే నటిగా పరిచయమైంది.
అలా జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టడంతో లేడీ కమెడియన్ గా అందరికీ పరిచయం అయింది.ఇక అప్పటినుంచి బుల్లెట్ భాస్కర్ టీంలో పనిచేస్తూ తన కామెడీతో అందరిని నవ్విస్తుంది.
ఇక మరో కమెడియన్ ఇమ్మానుయేల్ తో బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ బాగా మితిమీరి ప్రవర్తిస్తుంది.వీరిద్దరూ ఇప్పటికీ అలాగే ప్రవర్తించడంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అని అనుమానం వస్తుంది.
కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బాగా రచ్చ చేస్తుంది.వర్ష సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

సమయం దొరికితే చాలు నెట్టింట్లో గడిపేస్తుంది.ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు వర్ష.ఇక ఈమెను మరో యాంగిల్ లో చూస్తే హీరోయిన్లా ఉంటుంది.గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఈమెకు సినిమాలలో అవకాశాలు రావడం గ్యారెంటీ అని చాలామంది అనుకున్నారు.బహుశా గుర్తింపు సొంతం చేసుకోవడం కోసమే అవకాశాల కోసం సోషల్ మీడియాను బాగా వాడుకుంటుంది.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బయటపెడుతూ కుర్రాళ్లకు అందాల విందును వడ్డిస్తుంది.
అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులకు బాగా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా అలాగే రచ్చ చేస్తూ కనిపిస్తుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫోటోషూట్ లు చేయించుకోగా వాటిని తన ఇన్ స్టా వేదికలో పంచుకుంది.

అందులో తను ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా కనిపించింది.అచ్చం సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంత వేసుకున్న డ్రెస్ మాదిరిగా డ్రెస్ ఉండటంతోనే ఆ ఫోటో చూసి తన ఫాలోవర్స్ తనను అచ్చం సమంత లాగా ఉన్నావు అంటూ తెగ పొగిడారు.దీంతో కొంతమంది ట్రోలర్స్ అసలు మీకు ఏ యాంగిల్ లో సమంత ఎలా కనిపించింది బాబు అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈమెను చాలామంది హీరోయిన్లతో పోల్చగా ఏ రోజు కూడా తను అలా కనిపించలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.







