ట్రైన్‌లో రద్దీ.. లోకోపైలట్ సీట్లో కూర్చుని మహిళ ప్రయాణం

మెట్రో లేదా లోకల్ రైళ్లలో ప్రయాణం చేసినప్పుడు ఒక్కోసారి చాలా రద్దీగా ఉంటుంది.కాలు లోపలికి పెట్టలేనంతగా రద్దీ ఏర్పడుతుంది.

 Congestion In The Train.. Woman Travels Sitting In The Locopilot Seat , Train, L-TeluguStop.com

అలాంటి సందర్భాల్లో ప్రయాణించాలంటే చాలా కస్టంగా ఉంటుంది.ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతుంటారు.

ఇలాంటి జ్ఞాపకాలు, అనుభవాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎదురవుతూ ఉంటాయి.ఎంత రద్దీగా ఉన్నా చాలా మంది కిక్కిరిసిపోయిన రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు.

లేకపోతే తర్వాత ట్రైన్‌కి వెళ్లడానికి అలాగే ఉండిపోతారు.అయితే ఎంత రద్దీగా ఉన్నా, లోకోపైలట్ సీట్లో కూర్చోవాలని ఎవరూ అనుకోరు.

ఓ మహిళ మాత్రం ఇలాగే చేసింది.ట్రైన్ రద్దీగా ఉందని లోకో పైలట్ సీటులో కూర్చుని ప్రయాణించింది.

వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, ఇది నిజం.దీనికి సంబంధించిన ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లోకల్ ట్రైన్లు చాలా రద్దీగా ఉంటాయి.తక్కువ ధరకే ప్రయాణం చేసే సౌలభ్యం ఉండడంతో లోకల్ ట్రైన్లను ఎక్కువగా ప్రజలు ఆశ్రయిస్తుంటారు.ముఖ్యంగా ముంబై వంటి ప్రాంతాల్లో లోకల్ ట్రైన్లు సామాన్యులకు చాలా ఉపయోగపడుతున్నాయి.ఎప్పుడూ అవి రద్దీగా దర్శనమిస్తుంటాయి.

ఒక్కోసారి వేలాడుతూ చాలా మంది ప్రయాణం చేస్తుంటారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియోలో ఆసక్తికర దృశ్యం కనిపించింది.

ఓ స్టేషన్‌లో లోకల్ ట్రైన్ బాగా కిక్కిరిసి పోయి ఉంటుంది.

దీంతో కొందరిని దిగిపోవాలని పోలీసులు సూచిస్తారు.ఓ మహిళా ప్రయాణికురాలు తాను దిగేది లేదని మొండికేస్తుంది.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెతో పోలీసులు మాట్లాడతారు.

చివరికి ఆమెను లోకో పైలట్ సీట్లో కూర్చోపెట్టేందుకు ఒప్పిస్తారు.ఎట్టకేలకు ఒప్పుకున్న ఆమె లోకో పైలట్ సీట్లో కూర్చుని ప్రయాణం చేస్తుంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube