రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రవర్తన పై వెస్ట్రన్ దేశాలు తప్పుపడుతున్నాయి.అంతేకాకుండా రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికాతో పాటు పలు వెస్ట్రన్ దేశాలు చాలా ఆంక్షలు విధిస్తున్నాయి.
అయితే ఇటీవల రష్యా ఆయిల్ కొనుగోలు పై ప్రైస్ క్యాప్ విధించాయి.ఈ ప్రైస్ క్యాప్ తో బ్యారెల్ చమురును కేవలం 60 డాలర్లకు మాత్రమే కొనుగోలు చేయాలి.
కాదని మరే దేశమైనా అంతకుమించి ధర చెల్లించి కొనుగోలు చేస్తే అమెరికాతో పాటు పలు వెస్ట్రన్ దేశాల ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి.
అయితే రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చమురు మీద వచ్చే ఆదాయాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే తాజాగా యూకే మరోసారి ఆంక్షలు విధించింది.మరిన్ని కొత్తగా ఆంక్షలు రష్యా, రష్యాకు సాయం చేస్తున్న ఇరాన్ దేశాలపై విధిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.
ఉక్రెయిన్ లక్ష్యంగా డ్రోన్లను ఉత్పత్తి చేస్తున్న ఇరాన్ తో పాటు రష్యా సీనియర్ సైనిక కమాండర్లపై బ్రిటన్ మంగళవారం కొత్త ఆంక్షలు ప్రకటించింది.యూనిట్ ప్రోగ్రామింగ్ కు బాధ్యత వహిస్తున్న మేజర్ జనరల్ రాబర్ట్ బారానోవ్తో సహా 12 మంది రష్యా ఉన్నతాధికారులకు చెందిన ఆస్తులను స్తంభింప చేయడంతో పాటు ట్రావెల్ బ్యాన్ను విధించింది.

ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ ప్రకారం రష్యా క్షిపణి, ఫిరంగి దాడుల వల్ల 6000 మంది ఉక్రెయిన్ ప్రజలు మరియు కులు సైనికులు చనిపోయినట్లు బ్రిటన్ భావిస్తుంది.ఇది మానవ హక్కులను ఉల్లంఘించడమే అని బ్రిటన్ వాదిస్తోంది.రష్యాకు ఇరాన్ డ్రోన్ల లను సరఫరా చేయడంపై బ్రిటన్ సంబంధిత దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.యూకే విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ ఇరాన్ స్వదేశంలో పౌర నిరాశనాలతో మనుగడ ప్రయత్నాలలో భాగంగానే రష్యాతో ఒప్పందాలు కుదురుచుకుంటుందని ఆరోపణలు కూడా ఉన్నారు.







