ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారం కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ అందించిన నోటీసులపై ఉన్న స్టే ను న్యాయస్థానం పొడిగించింది.
ఈ మేరకు ఈనెల 22వ తేదీ వరకు స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.
కాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే పలువురికి నోటీసులు అందించిన విషయం తెలిసిందే.







