కాంతారా సినిమాకు సీక్వెల్ తీయాలనే రిషబ్ శెట్టి ఆలోచన తర్వాత ఈ వార్త కన్నడ నాట పాపులర్ అయింది.ప్రస్తుతం అందరూ కాంతారా గురించి మాట్లాడుకుంటున్నారు.
అయితే ఇక్కడ ఒక విషయం అందరిని బాగా ఆకర్షిస్తుంది.తులు ప్రాంతంలో బాగా ట్రెడిషనల్ కల్చర్ అయినటువంటి భూత కోల గురించి కాంతారా సినిమా తీసిన విషయం మనందరికీ తెలుసు.
ఇది ఒక గ్రామీణ నర్తనార్చన.ఈ నాట్యం లో పింజుర్ల, గుళిగ దేవుళ్ళు ఉంటారు.
ఆ దేవుళ్ళు ఆవహించే వారిని నాట్యకారులు లేదా దైవ నర్తకులు అంటూ ఉంటారు.వాస్తవానికి రిషబ్ శెట్టి ప్రొడ్యూసర్ విజయ్ తో ఆ దేవుళ్ళ అనుమతి తీసుకోవడానికి మంగుళూరు శివారులోని కదిరి మంజునాథేశ్వర గుడిలో భూతకోల ఉత్సవం జరుగుతుండగా వెళ్ళాడు.
పింజుర్ల దేవుడు ఆవహించిన ఉమేష్ పంబడా అనే ఒక దైవ నర్తకుడు ఉన్నాడు.అతడు చాల సీనియర్.ఇదంతా మనకు తెలిసిన విషయమే అయితే ఉమేష్ పంబడా దేవుడికి ఉత్సవం చేస్తున్న సమయంలో రిషబ్ శెట్టి అక్కడికి ఆశీస్సుల కోసం వెళ్ళాడు.అయితే తన దగ్గరికి వచ్చిన రిషబ్ కి నాట్యాచార్యులు ఏం చెప్పాడో తెలియదు అలాగే రిషబ్ ఏమి అడిగాడో కూడా తెలీదు.
ఆ తర్వాత అక్కడ ఉన్న వారు చెప్పిన దాన్ని బట్టి సినిమా తీయడానికి ముందే ధర్మస్థల ఆలయం నిర్వహిస్తున్నటువంటి వీరేంద్ర హెగ్డే ఆశీస్సులు మరియు అనుమతి తీసుకోవాలని పింజర్ల దేవుడు ఆవహించిన ఉమేష్ పంబడా తెలియజేశారట.

ఇక్కడ చాలా నమ్మశక్యం కాని కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి.ఎన్నో లక్షల మంది గ్రామ దేవతగా భావిస్తున్న పింజుర్ల దేవుడు మరొక దైవారాధికుడు అయినా వీరేంద్ర హెగ్డే అనుమతి ఎందుకు అడిగాడు అనే విషయం ఎవరికి అర్థం కాలేదు.ఇంతకీ ఈ వీరేంద్ర హెగ్డే ఎవరు అంటే ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయ్యాడు.
పద్మ భూషణ్ కూడా ఉంది.ఎంతో పాపులర్ అయినటువంటి ధర్మస్థల దేవాలయానికి వీరు వంశపారపర్య ధర్మకర్తలు.
దీనికి ఒక ట్రస్ట్ కూడా ఉంది.ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కన్నడ పరిశ్రమలోనే కాకుండా కర్ణాటకలో వీరేంద్ర హెగ్డే కి మంచి పేరుంది.

అయితే అసలు లాజిక్ లేని విషయం ఏంటంటే కాంతారావు సీక్వెల్ పర్మిషన్ కి వీరేంద్రకు ఏం సంబంధం? అలాగే నాట్యాచార్యుడు ఎందుకు వీరేంద్ర పేరు చెప్పాడు అని ? మరొక ఆకర్షణీయమైన సంఘటన ఏమిటి అంటే ఇది కాంతారా లాగా కాదట సీక్రెట్ తియ్యాలంటే ఒకటికి 100 సార్లు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే అలాగే భూత కోలా నాట్యానికి సంబంధించిన ఆచారాలు సాంప్రదాయాలను కూడా గౌరవించమని, చక్కగా పూజించమని చెప్పారట.ఏది ఏమైనా కాంతారా సినిమాని మనం ఇష్టపడ్డాం, ఇష్టపడుతున్నాం, ఇష్టపడుతూనే ఉంటాం.మరి దేవుడు అనే నమ్మకాన్నీ మాత్రమే కాకుండా మూఢనమ్మకంగా సినిమా తీస్తే ఎలా ఉంటుంది.
మూఢనమ్మకానికి రిషబ్ కి ముడి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న సందేహాలు వస్తున్నాయి.







