బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ షో కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఈ షో ఇండియాలో ప్రముఖ భాషల్లో ఎన్నో సీజన్స్ కంప్లీట్ చేసుకుంది.అన్ని చోట్ల ఎన్నో సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో మన తెలుగులో కూడా ప్రసారమయ్యి చాలా పాపులర్ అయ్యింది.
ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ షో మీద ఎలాంటి అంచనాలు లేవు.
కానీ స్టార్ట్ అయ్యాక వన్ వీక్ తర్వాత ఈ షో ఒక రేంజ్ లో పాపులర్ అయ్యింది.
ఈ షో మన దగ్గర సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ అనే చెప్పాలి.ఎందుకంటే మొదటి సీజన్ హోస్ట్ గా ఎన్టీఆర్ చేయడం వల్ల ఈ షో మరింత పాపులర్ అయ్యింది.
మన దగ్గర ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరవ సీజన్ కూడా స్టార్ట్ అయ్యి చివరికి కూడా చేరుకుంది.
అయితే కేవలం మొదటి సీజన్ కు మాత్రమే ఎన్టీఆర్ హోస్ట్ గా చేసారు.
రెండవ సీజన్ లో న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేయగా ఆ తర్వాత మూడవ సీజన్ నుండి ఇప్పుడు నడుస్తున్న 6వ సీజన్ వరకు కింగ్ నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు.అయితే నాగార్జున కూడా తన వాక్ చాతుర్యంతో బాగానే అలరించాడు.
కానీ బిగ్ బాస్ వారు వరుసగా నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ప్రేక్షకులు ఇంట్రెస్ట్ కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇది ఇప్పుడు 6వ సీజన్ లో కూడా జరుగుతుంది.అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు 7వ సీజన్ కోసం సరికొత్త హోస్ట్ ను తీసుకునే అవకాశం ఉందట.వచ్చే ఏడాది మధ్యలో ఈ కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
మరి ఇప్పటి నుండి ఈ సీజన్ కోసం బిగ్ బాస్ టీమ్ కొత్త హోస్ట్ ను వెతుకుతున్నారని.టాలీవుడ్ కు చెందిన ఒక యువ హీరో ఈసారి హోస్ట్ గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
చూడాలి ఈసారి ఏ హీరోను హోస్ట్ గా తీసుకు వస్తారో.