చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా తెలంగాణ మంత్రి తలసాని పీఏ అశోక్ ఈడీ ఎదుట హాజరైయ్యారు.
ఇప్పటికే ఈ కేసులో మంత్రి తలసాని సోదరులను అధికారులు విచారించారు.క్యాసినో దందాలో మనీలాండరింగ్, ఆర్థిక లావాదేవీలు, ఫెమా యాక్ట్ నింధనల ఉల్లంఘనలతో పాటె హవాలా చెల్లింపులపై సుదీర్ఘ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.







