2022 సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి బాగానే కలిసొచ్చింది.కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్లుగా నిలిచాయి.
డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ ఏడాది హిట్టైన సినిమాలలో డబ్బింగ్ సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.
మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని విమర్శకులను సైతం మెప్పించింది.కేజీఎఫ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన కేజీఎఫ్2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది.1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న కేజీఎఫ్2 సినిమా యాక్షన్ సినిమాను ఇష్టపడే ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.
మే నెలలో థియేటర్లలో విడుదలైన డాన్ మూవీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

జూన్ నెలలో విడుదలైన విక్రమ్ మూవీ కూడా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది.అదే నెలలో విడుదలైన చార్లి 777 సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.జులై నెలలో రిలీజైన రాకెట్రీ, గార్గీ సినిమాలు సైతం ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించాయి.

సెప్టెంబర్ నెలలో విడుదలైన పొన్నియిన్ సెల్వన్1, బ్రహ్మాస్త్ర పార్ట్1 ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అక్టోబర్ నెలలో రిలీజైన కాంతార మూవీ అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.గత నెల విడుదలైన లవ్ టుడే మూవీ కూడా ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించింది.
ఈ నెలలో విడుదల కానున్న అవతార్2 మూవీకి రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి.ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాల హవా కొనసాగుతోంది.







