రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఢీ డాన్స్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇప్పటికే 13 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఢీ షో ఇటీవల ఢీ14 సీజన్ ని కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.
సౌత్ ఇండియన్ డ్యాన్స్ రియాల్టీ షోలలోనే ఢీ షో ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే.మొదట ఇండియన్ మైకల్ జాక్సన్ అలాగే ప్రభుదేవా లాంటి గొప్ప గొప్ప కొరియోగ్రాఫర్ల చేతులమీదుగా మొదలైన ఈ షో విజవంతంగా 14 సీజన్లను విజయ పూర్తి చేసుకుంది.
అయితే ఇటీవల 14 సీజన్ ముగిసింది.
అప్పుడే 15వ సీజన్ కి సంబంధించిన పనులను ప్రారంభించారు షో నిర్వాహకులు.
అయితే ఈసారి ఢీ 15 సీజన్ ని ఏకంగా టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మాస్టర్ తో లాంచ్ చేయబోతున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా షో నిర్వాహకులు ఢీ 15 సీజన్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు.
ప్రతి బుధవారం ప్రసారం కానున్న ఢీ షోకి సంబంధించి.కంటెస్టెంట్స్, కొరియోగ్రాఫర్ లను పరిచయం చేస్తూ మొదటి ఎపిసోడ్ ని ఆదివారం ప్రసారం చేయనున్నారు.తాజాగా విడుదల చేసిన ప్రోమో మొత్తం అంతా కూడా ఎంతో ఎనర్జిటిక్ గా సాగింది.కాగా షో కి ముఖ్య అతిథిగా ప్రభుదేవా మాస్టర్ విచ్చేశారు.
ప్రభుదేవా మాస్టర్ తో పాటు జానీ మాస్టర్ గణేష్ మాస్టర్ లు కూడా సందడి చేశారు.ఈ నేపథ్యంలోనే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ తర్వాత స్టేజిపై ఎమోషనల్ అయ్యారు.ఇచ్చిన కంటెస్టెంట్లు చేంజ్ మీద పర్ఫామెన్స్ అయిన తర్వాత ప్రదీప్ ఆ కంటెస్టెంట్ వాళ్ళ అమ్మ తమ్ముడిని పిలిపించి సర్ప్రైస్ చేయడంతో వాళ్ళ భాగోద్వేగాన్ని చూసి ప్రభుదేవా జానీ మాస్టర్లు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 11న రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.