AP04 రామాపురం రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ యు హేమ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా AP04 రామాపురం.ఎస్వి శివారెడ్డి సమర్పణలో ఆర్ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ రెడ్డి అందూరి ప్రొడ్యూసర్ ఈ సినిమాను నిర్మించాడు.

 Ap04 రామాపురం రివ్యూ: సినిమా ఎలా -TeluguStop.com

ఇక ఈ సినిమాలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, ఎస్ ఎస్ కుమార్, పి ఎన్ రాజ్ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు సాకేత్ వేగి, అబు సంగీతాన్ని అందించారు.ఇక ఈ సినిమా థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.రామపురం అనే గ్రామంలో డ్యూటీ చేసే ఇన్స్పెక్టర్ అనుకోకుండా చెట్టుకు ఉరేసుకుని చనిపోతాడు.దీంతో అతడు అలా చనిపోవడంతో ఇది ఆత్మహత్య అని అనుకుంటారు ఊరి జనాలు.

కానీ పోస్టుమార్టంలో మాత్రం హత్య అని తెలుస్తుంది.అయితే ఆ గ్రామంలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి కొత్త ఎస్ఐగా రంగంలోకి దిగుతాడు పిఎన్ రాజు.

ఇక ఇతడు ఊరిలో ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు.ఇక అదే ఊరికి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం స్వచ్ఛంద సేవ నుంచి రామ్ జక్కల వస్తాడు.

అయితే అతడు తన పని మీద ఊరిలో తిరుగుతుండగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అఖిల ఆకర్షణ అనూహ్యంగా కనిపించడంతో షాక్ అవుతాడు.గతంలో తనను దూరం పెట్టినవన్ని గుర్తుకు చేసుకొని అలా ఎందుకు చేసిందో అర్థం కాకుండా ఉన్న అతడికి ఆమె కనిపించటంతో మాట్లాడాలని అనుకుంటాడు.

కానీ ఆ ఊర్లో ఉన్న కట్టుబాట్ల వల్ల వాళ్ళిద్దరూ మాట్లాడలేక పోతారు.మరోవైపు రాజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా అదే సమయంలో ఆ ఊరి వీఆర్వో కూడా చెట్టుకు ఉరేసుకొని చనిపోతాడు.

అయితే అతడి జేబులో సూసైడ్ లెటర్ కూడా ఉంటుంది.ఆ సూసైడ్ లెటర్ ప్రకారం ఇది కూడా ఆత్మహత్య అని అనుకుంటారు.

కానీ మా ఊరి సర్పంచ్ అయినా అఖిల తండ్రి ఎస్ ఎస్ కుమార్ ఇది హత్య అని అంటాడు.దీంతో ఆ గ్రామస్తులు ఎస్సై ని కూడా అనుమానిస్తారు.

ఆ తర్వాత మరో పంచాయతీ సెక్రెటరీ రావడంతో అతడు కూడా అదే చెట్టుకు అలాగే చనిపోవడంతో అందరికీ అనుమానం వస్తుంది.దీంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారా లేక హత్య జరుగుతుందా అనేది ఆ ఊరిలో ఉండే ఆ కట్టుబాట్లు ఏంటి అనేది మిగిలిన కథలోనిది.

Telugu Akhila, Apramapuram, Hema Reddy, Ram Jakkala, Saket Vegi, Sv Siva Reddy,

నటినటుల నటన:

రామ్ జక్కల తన పాత్రతో బాగా అద్భుతంగా మెప్పించాడు.హీరోయిన్ అఖిల ఆకర్షణ కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా కనిపించింది.ఇక మిగతా నటీనటులంతా చాలావరకు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

డైరెక్టర్ హేమ రెడ్డి ప్రేక్షకులు ముందుకు మంచి కథను తీసుకొచ్చాడు.బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు.ఇక మిగిలిన నిర్మాణ విలువలు బాగానే పనిచేశాయి.

Telugu Akhila, Apramapuram, Hema Reddy, Ram Jakkala, Saket Vegi, Sv Siva Reddy,

విశ్లేషణ:

ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందగా మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ లు బాగా ఆకట్టుకున్నాయి.చాలా వరకు కథ లో తరువాత ఏం జరుగుతుందో అనేది చాలా సస్పెన్స్ గా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్

: కథ, నటీనటుల నటన, సస్పెన్స్, సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ స్లో గా అనిపించింది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే.ఈ సినిమా క్రైమ్ సస్పెన్స్ ను ఇష్టపడే వాళ్ళకు కచ్చితంగా నచ్చుతుంది.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube