400 మిలియన్ల ఖర్చుతో విమానాలను మరింత ఆకర్షణీయంగా మార్చనున్న ఎయిర్ ఇండియా..

టాటా గ్రూప్‌ ఆధీనంలోని ఎయిర్‌ ఇండియా విమాన క్యాబిన్ల లుక్‌ను అత్యంత అధునాతనంగా మార్చేందుకు సిద్ధమైంది.ఇందుకోసం ఏకంగా 400 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది.

 Air India Will Make Flights More Attractive At A Cost Of 400 Million Tata Group,-TeluguStop.com

ఈ సంస్థ మొదటగా బోయింగ్‌ 777, 787 ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యాబిన్లను మార్చనుంది.ఇంటర్నేషనల్ మార్కెట్‌లో నెలకొన్న పోటీని తట్టుకునేందుకే వీటిని మొదటగా కొత్తగా మార్చేందుకు టాటా గ్రూప్ అడుగులు వేస్తోంది.

ఈ మార్పుల్లో భాగంగా ఇంటీరియర్‌ను ఇంప్రూవ్ చేయడం, ఎక్స్‌ట్రా సీట్లను ఏర్పాటు చేయడం వంటివి చేయనుంది.ఎయిర్ ఇండియాకి 27 బోయింగ్‌ 787, 13 బోయింగ్‌ 777 విమానాలు ఉన్నాయి.

వీటన్నిటిని వరల్డ్ క్లాస్ లెవెల్‌లో అత్యంత అడ్వాన్స్‌డ్‌గా మార్చనున్నారు.ప్రధానంగా ఇంటర్నేషనల్ విమానాలలోని ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను రీడిజైన్ చేస్తారు.

బోయింగ్‌ 777లో ఫస్ట్‌ క్లాస్‌ క్యాబిన్‌ క్యాబిన్‌ను అలాగే ఉంచి అడ్వాన్స్‌డ్‌గా మార్చనున్నారు.

Telugu Air India, International, Tata-Latest News - Telugu

విమానాలలోని ఇంటీరియర్‌ మార్చే బాధ్యతనంతా లండన్‌కు చెందిన జీపీఏ డిజైన్‌కు టాటా గ్రూప్ అప్పజెప్పింది.కాగా 2024 నుంచి విమానాలు కొత్త డిజైన్, లుక్, సౌకర్యాలతో అందుబాటులోకి రానున్నాయి.ప్రస్తుతం 44 శాతం మంది ఇంటర్నేషనల్ ప్యాసింజర్లను ఇండియాకు చెందిన విమనయాన సంస్థలు రవాణా చేస్తున్నాయి.

వీటిలో ఇండిగో 15 శాతం వాటాతో టాప్ ప్లేస్ లో ఉంది.ఎయిర్‌ ఇండియా 11 శాతం వాటాతో తర్వాత స్థానంలో నిలుస్తోంది.అయితే తమ విమానాలలోని సౌకర్యాలను, కాబిన్ లుక్స్, ఇంకా మరిన్ని సేవలను  అందుబాటులోకి తేవడం ద్వారా విదేశీయులను ఎయిర్ఇండియా ఏరోప్లేన్స్ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.దీనివల్ల ఇంటర్నేషనల్ ఫ్లైట్ మార్కెట్‌లో టాటా సంస్థ టాప్ ప్లేస్ కి చేరుకునే అవకాశం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube