వారంలో ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే ఎల్లప్పుడూ యవ్వనంగా మెరిసిపోతారు!

ఎల్లప్పుడూ తమ చర్మం యవ్వనంగా మరియు కాంతివంతంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ఈ క్రమంలోనే కొందరు చర్మం విషయంలో ఎన్నెన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు.

 Follow This Remedy Once A Week For A Youthful Glowing Skin , Glowing Skin, Youth-TeluguStop.com

చ‌ర్మం కోసం ఎంతో కేర్ తీసుకుంటారు.కానీ కొందరికి మాత్రం చర్మాన్ని పట్టించుకునేంత సమయం ఉండదు.

అయితే అలాంటి వారు వారంలో ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే ఎల్లప్పుడూ యవ్వనంగా మరియు అందంగా మెరిసిపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక మీడియం సైజ్‌ టమాటోను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ప‌ది నుంచి ప‌న్నెండు ఫ్రెష్ పుదీన ఆకులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తాని మ‌ట్టి, రెండు టేబుల్ స్పూన్లు టమాటో- పుదీనా జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Youthful Skin-Telu

ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారంలో ఒక్కసారి ఇలా చేస్తే చర్మంపై పెరుకు పోయిన మురుకి, మృత‌ కణాలు తొలగిపోతాయి.మచ్చలు, మొండి మొటిమలు ఏమైనా ఉంటే క్రమంగా తగ్గుముఖం పడతాయి.

చర్మం టైట్ గా మరియు గ్లోయింగ్ గా మారుతుంది.ఈ రెమెడీని పాటించడం వల్ల వృద్ధాప్య ఛాయలు సైతం త్వరగా దరిచేరకుండా ఉంటాయి.

దీంతో యవ్వనంగా మెరిసిపోతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube